అమ్మాయిలపై దాడి ఘటనపై రామ్ గోపాల్ వర్మ స్పందన
- మధ్యప్రదేశ్ లో ఇద్దరు అమ్మాయిలను చితకబాదిన బంధువులు
- ఈ దారుణాన్ని నమ్మలేకపోతున్నానన్న వర్మ
- దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరినీ శిక్షించాలని డిమాండ్
ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఇద్దరినీ చితకబాదారు. గత నెల 22న వీరిపై దాడి జరిగింది. జుట్టు పట్టుకుని ఇద్దరినీ ఈడుస్తూ, కర్రలతో చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు.
మరోవైపు ఈ ఘటనపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ దారుణాన్ని నమ్మలేకపోతున్నానని అన్నారు. దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరికీ శిక్ష విధించాలని... లేకపోతే ఈ దేశంపై తనకు ఉన్న నమ్మకమే పోతుందని పేర్కొన్నారు.