Ashritha: అరుదైన ఘనత సాధించిన హీరో వెంకటేశ్ కుమార్తె అశ్రిత

Hero Venkatesh daughter Ashritha gets place in Instagram rich list
  • ఇన్ స్టాగ్రామ్ లో భారీగా సంపాదిస్తున్న తారలు
  • ప్రపంచ జాబితాలో అశ్రితకు 377వ స్థానం
  • ఆసియా స్థాయిలో 27వ స్థానం
  • ఒక్కో పోస్టుకు రూ.29 వేలు పొందుతున్న అశ్రిత!
సెలబ్రిటీల పాలిట ఇన్ స్టాగ్రామ్ ఆదాయ వనరుగా మారింది. క్రిస్టియానో రొనాల్డో, విరాట్ కోహ్లీ, ప్రియాంక చోప్రా వంటి వారు ఇన్ స్టాగ్రామ్ లో ఒక్కో పోస్టుకు కోట్లలో ఆదాయం పొందుతారంటే అతిశయోక్తి కాదు. ఇటీవలే హాపర్ హెచ్ క్యూ అనే సంస్థ సెలబ్రిటీల ఇన్ స్టాగ్రామ్ ఆదాయ వివరాలను వెల్లడించింది. ఈ జాబితాలో టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్ కుమార్తె అశ్రిత కూడా ఉండడం విశేషం. హాపర్ హెచ్ క్యూ జాబితాలో వరల్డ్ వైడ్ గా అశ్రితకు 377వ స్థానం దక్కింది. అదే ఆసియాలో చూస్తే ఆమె 27వ స్థానంలో ఉంది.

అశ్రిత ఇన్ స్టాగ్రామ్ లో పెట్టే ఒక్కో పోస్టుకు సుమారుగా రూ.29 వేలు లభిస్తాయట. ఇంతకీ అశ్రిత పోస్టుల్లో ఉండేది కుకింగ్ వీడియోలు. ఇన్ఫినిటీ ప్లాటర్ అనే అకౌంట్ తో ఆమె ఇన్ స్టాగ్రామ్ లో వంటల వీడియోలను పంచుకుంటుంది. ఇన్ స్టాలో ఇన్ఫినిటీ ప్లాటర్ అకౌంట్ కు 13 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. బిస్కట్లు, కేకులు, ఇతర స్నాక్స్ ఐటమ్స్ లో కొత్త రకాలను అశ్రిత సోషల్ మీడియాలో పరిచయం చేస్తుంటుంది.

అశ్రిత ప్రస్తుతం స్పెయిన్ లో ఉంటోంది. ఆమెకు రెండేళ్ల కిందట వినాయక్ రెడ్డితో వివాహం జరగ్గా, అప్పటి నుంచి స్పెయిన్ లోని బార్సిలోనా నగరంలో నివసిస్తోంది.
Ashritha
Venkatesh
Instagram
Rich List
Asia
World
Tollywood

More Telugu News