ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి ప్రమాణస్వీకారం
- అనూహ్యరీతిలో తీరథ్ సింగ్ రాజీనామా
- కొత్త సీఎంగా పుష్కర్ సింగ్ ధామి
- బీజేపీ శాసనసభాపక్షం ఆమోదం
- ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్
నాలుగు నెలల వ్యవధిలో ఉత్తరాఖండ్ కు మూడో సీఎం వచ్చారు. గత మార్చిలో త్రివేంద్ర సింగ్ రావత్ తప్పుకోగా, తీరథ్ సింగ్ రావత్ సీఎం అయ్యారు. అయితే, ఆయన ఎంపీ కావడంతో, సీఎంగా కొనసాగాలంటే ఎమ్మెల్యేగా గెలవడం అనివార్యమైంది. ఇప్పట్లో ఎన్నికలు జరిగే పరిస్థితులు లేకపోవడంతో ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పుష్కర్ సింగ్ ధామి సీఎం అయ్యారు. పుష్కర్ సింగ్ ధామి ఖతిమా అసెంబ్లీ స్థానం నుంచి రెండు పర్యాయాలు గెలిచారు.