Sajjala Ramakrishna Reddy: రెచ్చగొడితే రెచ్చిపోం... ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాం: సజ్జల

Sajjala comments on Telugu states water disputes
  • ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలు
  • అభిప్రాయాలు వెల్లడించిన సజ్జల
  • సందర్భోచితంగా స్పందిస్తామని వెల్లడి
  • ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోమని స్పష్టీకరణ
ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలుగు రాష్ట్రాల జలవివాదాలపై స్పందించారు. నీటి వివాదాలపై రెండు రాష్ట్రాలు చర్చలు జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నామని, అందుకోసం ఏంచేయాలో అన్నీ చేస్తామని స్పష్టం చేశారు. ఒక్క నీటి చుక్కను కూడా వదులుకునేందుకు తాము సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. తాము రెచ్చగొడితే రెచ్చిపోమని, సందర్భోచితంగా స్పందిస్తామని, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతామని పేర్కొన్నారు.

ప్రాజెక్టుల వివాదాలపై ఇప్పటికే అందరికీ లేఖలు రాశామని, కేంద్రం కూడా మధ్యవర్తిత్వం వహిస్తోందని సజ్జల వెల్లడించారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతామని చెప్పారు.
Sajjala Ramakrishna Reddy
Water Disputes
Andhra Pradesh
Telangana

More Telugu News