ఫిలిప్పీన్స్లో కూలిన సైనిక విమానం.. ప్రమాద సమయంలో విమానంలో 92 మంది
- ప్రమాద సమయంలో విమానంలో 92 మంది
- ఇప్పటి వరకు 45 మందిని రక్షించిన అధికారులు
- కొనసాగుతున్న సహాయక కార్యక్రమాలు
- కూలినవెంటనే విమానానికి మంటలు
ప్రమాదానికి గురైన సి-130 విమానంలోని సైనికులు ఇటీవలే ప్రాథమిక సైనిక శిక్షణను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. దుర్ఘటన జరిగిన వెంటనే విమానానికి మంటలు అంటుకున్నాయి. ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఏర్పాటు చేసిన సంయుక్త బృందంలో వీరిని చేర్చేందుకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానంలో ముగ్గురు పైలట్లు, ఐదుగురు సిబ్బంది కూడా ఉన్నట్టు ఆ దేశ రక్షణ మంత్రి డెల్ఫిన్ లోరెంజానా తెలిపారు. కాగా, విమానం కూలిన జోలో ద్వీపంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి.