తెలంగాణలో నేడు ఓ మాదిరిగా, రేపు భారీగా వర్షాలు
- బలహీనపడిన ఉపరితల ద్రోణి
- పశ్చిమ వైపు నుంచి తెలంగాణవైపు తక్కువ ఎత్తులో గాలులు
- సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా పగటి ఉష్ణోగ్రతలు
నల్గొండ జిల్లా చలకుర్తిలో అత్యధికంగా 2.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, భద్రాద్రి జిల్లాలోని మల్కారంలో 1.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల వరకు తక్కువగా నమోదైనట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.