వింబుల్డన్ లో సానియా జోడీకి చుక్కెదురు
- డబుల్స్ రెండో రౌండ్లో ఓటమి
- బెతానీ జంటగా బరిలో దిగిన సానియా
- సానియా-బెతానీ జోడీపై రష్యా భామల విజయం
- వరుస సెట్లలో గెలిచిన వెస్నినా-కుదెర్మెటోవా జోడీ
తొలి సెట్ లో కాస్తో కూస్తో పోరాడిన సానియా జోడీ... రెండో సెట్ లో చేతులెత్తేసింది. ఈ ఓటమితో వింబుల్డన్ మహిళల డబుల్స్ లో సానియా పోరాటం ముగిసింది. ఇక ఆమె మిక్స్ డ్ డబుల్స్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. రెండో రౌండ్ మ్యాచ్ లో సానియా-రోహన్ బోపన్న జోడీ... బ్రిటీష్ జంట ఐడన్ మెక్ హ్యూ, ఎమిలీ వెబ్లీ స్మిత్ తో తలపడనుంది.