జీహెచ్ఎంసీ పరిధిలో 100కి దిగువన కరోనా కేసులు
- గత 24 గంటల్లో 1,08,954 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 98 కేసులు
- రాష్ట్రవ్యాప్తంగా 848 మందికి కరోనా
- ఆరుగురి మృతి
అదే సమయంలో 1,114 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 6,26,085 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,09,947 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 12,454 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,684కి చేరింది.
