01 Sat 14:34 ఇంగ్లండ్ టూర్ కు పృథ్వీ షా.. గిల్ కు బ్యాకప్ గా పంపేందుకు బీసీసీఐ యోచన! ఐదు రోజులుగా కసరత్తులు ఓపెనర్ స్థానానికి పరిశీలన కాలి గాయంతో శుభ్ మన్ గిల్ సిరీస్ కు అనుమానమే ఆగస్టు 4 నుంచి 5 టెస్టుల సిరీస్
02 Fri 11:35 ఆ మందులపై కేంద్రం కొరడా.. ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి! అధిక ఆల్కహాల్‌తో కూడిన మందులను 'షెడ్యూల్ హెచ్1' కిందకు చేర్చిన కేంద్రం 12 శాతం కంటే ఎక్కువ ఆల్కహాల్, 30ఎంఎల్ ప్యాక్‌కు వర్తించనున్న కొత్త నిబంధనలు ఇకపై ఈ ఔషధాల కొనుగోలుకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయమన్న ప్రభుత్వం మందుల షాపులు అమ్మకాల రికార్డులను మూడేళ్లపాటు భద్రపరచాలని ఆదేశం
03 Fri 11:32 ఒంటరి మహిళ ఇంట్లో 25 తులాల బంగారం చోరీ.. ఆపై ఇల్లు దహనం! అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో దారుణం రైల్వే శాఖలో పాయింట్స్‌మెన్‌గా పని చేస్తున్న బాధితురాలు ఉద్యోగానికి వెళ్లిన సమయంలో మొత్తం దోచేసిన దొంగలు
04 Fri 11:29 కార్పొరేట్ ఉద్యోగానికి గుడ్‌బై.. నెలకు రూ.1.8 లక్షల ఆదాయం.. రెడ్డిట్‌లో వైరల్ పోస్ట్! కార్పొరేట్ ఉద్యోగం వదిలి వ్యాపారం మొదలుపెట్టిన 33 ఏళ్ల మహిళ ఇద్దరు రెగ్యులర్ క్లయింట్లతో పాటు మరో కొత్త ఒప్పందం కుదిరిందని వెల్లడి డబ్బు కంటే కుటుంబంతో గడిపే స్వేచ్ఛే పెద్ద విజయమని చెప్పిన మహిళ ఉద్యోగం వదిలే ముందు పొదుపు, స్పష్టమైన ప్రణాళిక తప్పనిసరని సూచన తన అనుభవాలను రెడ్డిట్ వేదికగా పంచుకున్న మార్కెటింగ్ ప్రొఫెషనల్
05 Fri 11:23 70 ఏళ్ల వయసులోనూ చిరులో ఏమాత్రం తగ్గని జోష్.. ‘మెగా 158’ కోసం 12 గంటలు ఏకధాటిగా వర్షంలో షూటింగ్! బాబీ దర్శకత్వంలోని సినిమా కోసం చిరంజీవి కష్టం వర్షంలో 12 గంటల పాటు ఏకధాటిగా యాక్షన్ సీన్ చిత్రీకరణ చిరు అంకితభావం చూసి ఆశ్చర్యపోయిన చిత్ర బృందం ‘మెగా 158’ వర్కింగ్ టైటిల్‌తో హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్
06 Fri 10:44 ‘ముందు మంచి తల్లిగా మారండి.. తర్వాత ఐఏఎస్ అవ్వండి’.. యూపీ గవర్నర్ సూచన పెళ్లి తర్వాత అమ్మాయిలు చదువు ఆపొద్దన్న ఆనందీబెన్ ఉద్యోగం, కుటుంబం మధ్య సమతుల్యం అవసరమన్న గవర్నర్ పిల్లలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలని సూచన మాదకద్రవ్యాలపై ఆందోళన వ్యక్తం చేసిన గవర్నర్ నైతిక విలువలతోనే విద్య పరిపూర్ణమని వ్యాఖ్య
07 Fri 10:41 గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా?.. కొత్త పరిశోధనలో షాకింగ్ నిజాలు! డెస్క్ ఉద్యోగాల్లో గంటల తరబడి కూర్చోవడం వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతోందని వెల్లడి రోజూ వ్యాయామం చేసినప్పటికీ ఈ ప్రమాదం నుంచి తప్పించుకోలేరన్న అధ్యయనం నిరంతరాయంగా 30 నిమిషాలకు మించి కూర్చోవడమే అసలు సమస్య అని స్పష్టీకరణ ప్రతి అరగంటకు ఒకసారి లేచి తిరగడం ద్వారా ముప్పు తగ్గించుకోవచ్చని నిపుణుల సూచన
08 Fri 10:38 పోలీసుల కాల్పుల్లో నలుగురు గ్యాంగ్‌స్టర్ల హతం.. ముగ్గురు పోలీసులకు గాయాలు గురుగ్రామ్‌లో పోలీసులకు, గ్యాంగ్‌స్టర్లకు మధ్య కాల్పులు వ్యాపారి నుంచి డబ్బు వసూలుకు యత్నించిన ముఠా విదేశాల్లోని గ్యాంగ్‌స్టర్ దీపక్ నందల్ పేరు వెలుగులోకి
09 Fri 10:35 యూఎస్ ఫెడ్ కీలక నిర్ణయం.. వివాదంలో ఎక్స్‌బాక్స్ సీఈఓ నియామకం అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఆధునికీకరణకు ఐదు కొత్త టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటు ఉత్పాదకత, ఉద్యోగాల ప్యానెల్‌కు 'ఎక్స్‌బాక్స్' సీఈఓ ఆశా శర్మ నియామకం ఆర్థిక వ్యవస్థపై ఏఐ ప్రభావాన్ని అధ్యయనం చేయనున్న టాస్క్‌ఫోర్స్ లు విధానాలను మెరుగుపరిచేందుకే ఈ మార్పులని ఫెడ్ ఛైర్మన్ వెల్లడి
10 Fri 10:32 120 కి.మీ. వేగంతో దూసుకెళ్తున్న నితిన్ గడ్కరీ కాన్వాయ్.. ఒక్కసారిగా అడ్డొచ్చిన గ్రామస్థులు.. తప్పిన పెను ప్రమాదం! ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పరిశీలనలో నితిన్ గడ్కరీ మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో కాన్వాయ్‌కు ఎదురైన నిరసన పంట పొలాల్లో నీటి నిల్వ సమస్యపై గ్రామస్థుల ఆందోళన ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పోలీసులు