ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ రాజీనామా
- నాలుగు నెలల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు
- రాజ్యాంగ సంక్షోభాన్ని నివారించేందుకే
- ఈసారి సిట్టింగ్ అభ్యర్థికే పగ్గాలు
మరోవైపు సొంతపార్టీ నుంచి కూడా ఆయనకు నిరసన సెగ మొదలైంది. దీంతో గత మూడు రోజులుగా హస్తినలోనే మకాం వేసిన తీరత్ సింగ్ నిన్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. అనంతరం తన రాజీనామా లేఖను అందించారు. తీరత్ సింగ్ ప్రస్తుతం గర్వాల్ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, ఉత్తరాఖండ్లో రాజకీయ సంక్షోభాన్ని నివారించేందుకు ఈసారి సిట్టింగ్ అభ్యర్థికే ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలని అధిష్ఠానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.