Varla Ramaiah: విజయసాయిరెడ్డి గారూ, మీరు విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు: వర్ల ఎద్దేవా

Varla comments on Vijayasai Reddy remarks
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన సాధన దీక్షలో జనాలు ఎవరూ లేరని, కనీసం మీడియా కవరేజీ కూడా లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేయడం జరిగింది. ఏమైపోయారు కార్యకర్తలు...?.... చంద్రబాబుకు ఇది ఘోర అవమానం! అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు.

ఏ2 విజయసాయిరెడ్డి మిడిమిడి జ్ఞానంతో విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. నిన్న చంద్రబాబు చేపట్టిన సాధన దీక్ష కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా, పరిమిత సంఖ్యలో కొద్దిమందితోనే నిర్వహించారని వివరణ ఇచ్చారు. కార్తకర్తలెవరూ రావొద్దని, ఎవరి నియోజకవర్గంలో వారు దీక్ష చేయాలని ఆదేశించామని, ఈ విషయం కూడా తెలియని మీరు ఒక ఎంపీనా? అంటూ వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Varla Ramaiah
Vijay Sai Reddy
Chandrababu
Sadhana Deeksha
TDP

More Telugu News