ఆస్కార్ అకాడమీ సభ్యులుగా ఎంపికైన విద్యాబాలన్, ఏక్తా కపూర్
- 2021కి గాను కమిటీని ప్రకటించిన ఆస్కార్ అకాడెమీ
- కమిటీలో 50 దేశాల నుంచి 395 మంది సభ్యులు
- జాబితాలో 46 శాతం మంది మహిళలే కావడం గమనార్హం
'ద క్లాస్ ఆఫ్ 2021' పేరుతో ఈ జాబితాను విడుదల చేసింది. జాబితాలో 46 శాతం మంది మహిళలు ఉండటం గమనార్హం. ఏక్తా కపూర్ తల్లి, బాలాజీ టెలీ ఫిలింస్ సహ నిర్మాత అయిన శోభా కపూర్ కూడా ఆస్కార్ కమిటీలో ఉన్నారు. 2011లో విడుదలైన 'డర్టీ పిక్చర్' చిత్రానికి గాను విద్యాబాలన్ జాతీయ అవార్డును దక్కించుకున్న సంగతి తెలిసిందే.