మళ్లీ సెట్స్ పైకి వెళ్లిన 'బింబిసార'
- చారిత్రక నేపథ్యంలో 'బింబిసార'
- ముగింపు దశలో షూటింగ్
- సంయుక్త మీనన్ పరిచయం
- ముఖ్యమైన పాత్రలో కేథరిన్
మళ్లీ ఇప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లినట్టుగా చెబుతున్నారు. నెల రోజుల పాటు జరిపే చిత్రీకరణతో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తవుతుందని అంటున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో కల్యాణ్ రామ్ ఉన్నాడని చెబుతున్నారు. ఈ సినిమాతో కథానాయికగా సంయుక్త మీనన్ తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఇక కేథరిన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో అలరించనుంది. కొత్త దర్శకుడితో కల్యాణ్ రామ్ చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.