సినీ నిర్మాత సి.కల్యాణ్ కు సుప్రీంకోర్టు నోటీసులు!
- హఫీజ్ పేట భూముల కేసులో విచారణ
- ఫైనల్ డిక్రీ లేకుండా నిర్మాణాలేంటని ప్రశ్న
- సమాధానం చెప్పాలని నోటీసులు
ఈ తీర్పును సవాల్ చేస్తూ హమీదున్నీసా బేగం, సెహెబ్బాదీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బుధవారం నాడు ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, నవీన్ సిన్హాలతో కూడిన ధర్మాసనం, ఫైనల్ డిక్రీ పొందకుండా కట్టడాలు ఎలా కడతారని ప్రశ్నించింది. కల్యాణ్ తరఫున న్యాయవాది శ్రీధర్ వాదనలు వినిపిస్తూ, ఫైనల్ డిక్రీ వచ్చిందని చెప్పారు.
దీనిపై అసహనాన్ని వ్యక్తం చేసిన ధర్మాసనం, ఫైనల్ డిక్రీ ఇవ్వలేదని హైకోర్టు తీర్పులో స్పష్టంగా ఉందని గుర్తు చేసింది. ఈ విషయంలో స్పందించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి, కల్యాణ్ కు నోటీసులు జారీ చేసింది.