భారత్లోని అసంఘటిత రంగ కార్మికులకు రూ. 3,717 కోట్ల కరోనా రుణం.. ప్రపంచ బ్యాంకు ఆమోదం
- మొత్తం రుణంలో 22.5 శాతం అంతర్జాతీయ సమాజం నుంచి, 77.5 శాతాన్ని ఐబీఆర్డీ నుంచి సేకరణ
- తాజా రుణ చెల్లింపునకు 18.5 ఏళ్ల గడువు
- పేదలు, నిస్సహాయుల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఉపయోగం
దేశంలోని పేదలు, నిస్సహాయుల జీవన ప్రమాణాలను పెంచేందుకు ఈ రుణాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అలాగే, గతేడాది ఆమోదించిన రెండు ముఖ్యమైన అంశాల్లో ఒకటైన జాతీయ సామాజిక భద్రత పథకం కింద గుర్తించిన 32 కోట్ల మంది లబ్ధిదారులకు అదనపు ఆహార ధాన్యాలను అందించాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. తాజా రుణానికి ఐదేళ్ల అదనపు పొడిగింపుతో కలిపి 18.5 ఏళ్ల గడువు ఉంటుంది.