ఏపీలో గత 24 గంటల్లో 3,797 కరోనా కేసుల నమోదు

AP Covid cases and deaths update
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 97,696 కరోనా పరీక్షలు నిర్వహించగా, 3,797 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 874 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 105 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 5,498 మంది కరోనా నుంచి కోలుకోగా, 35 మంది మృతి చెందారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 8 మంది కరోనాతో కన్నుమూశారు. చిత్తూరు జిల్లాలో ఏడుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో 12,706 మంది కరోనాతో మృతి చెందారు. ఏపీలో ఇప్పటిదాకా 18,89,513 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 18,38,469 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 38,338 మందికి చికిత్స జరుగుతోంది.
Go Back to Shorts
Andhra Pradesh
Covid
Daily Cases
Deaths
Update

More Telugu News