మమతా బెనర్జీకి, బెంగాల్ ప్రభుత్వానికి జరిమానా విధించిన కలకత్తా హైకోర్టు
- టీఎంసీ నేతలను అరెస్ట్ చేసిన సీబీఐ
- సీబీఐ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేసిన మమత
- కోర్టులను ఆశ్రయించిన మమత
దీంతో మమత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు... మమత తదితరులు ఇచ్చిన సమాధానాన్ని హైకోర్టు స్వీకరించకపోవడం చట్టబద్ధం కాదని వ్యాఖ్యానించింది. వీరి అఫిడవిట్లను రికార్డు చేయడంతో పాటు, తొలి నుంచి విచారణ ప్రారంభించాలని హైకోర్టును ఆదేశించింది. దీంతో, కొత్తగా అఫిడవిట్లు దాఖలు చేసేందుకు అనుమతినివ్వాలంటూ మమత హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తును హైకోర్టు స్వీకరించింది. అయితే, సరైన సమయంలో అఫిడవిట్లు దాఖలు చేయనందుకు మమతకు, ప్రభుత్వానికి రూ. 5 వేల జరిమానా విధించింది.