అక్షయ్ కుమార్ జోడీగా ఛాన్స్ కొట్టేసిన రకుల్!
- తెలుగులో తగ్గిన అవకాశాలు
- తమిళంలోను పెద్దగా లేని క్రేజ్
- బాలీవుడ్ పైనే పూర్తి దృష్టి
బాలీవుడ్ చుట్టూ రకుల్ ప్రదక్షిణ చేస్తుంటే, ఇక్కడ ఆమెకి గల ప్లేస్ చేజారిపోయింది. ఒక్కసారిగా తెలుగులో రకుల్ కి సినిమాలు తగ్గిపోయాయి. ఇక తమిళంలో ఆమె పెద్దగా దృష్టి పెట్టలేదు గనుక, ఆ విషయాన్ని గురించి మాట్లాడుకోవలసిన అవసరం లేదు. అయితే బాలీవుడ్ లో నిలదొక్కుకోలేకపోతే రకుల్ పని అయిపోయినట్టేనని అంతా అనుకున్నారు. కానీ బాగానే బాలీవుడ్ లో ఓ మూడు సినిమాలు చేస్తోంది. అంతేకాదు అక్షయ్ కుమార్ జోడీగా చేసే ఛాన్స్ కొట్టేసింది. రంజిత్ తివారి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. శ్రద్ధా కపూర్ .. కియారా అద్వానీని దాటుకుని ఈ ఛాన్స్ రకుల్ కి రావడం విశేషం.