Kamal Haasan: 'దృశ్యం' తమిళ సీక్వెల్లో కమల్ జోడీగా నదియా!

Kamal Haasan and Nadiya in Drushyam 2 Tamil Version
  • తమిళంలో 'పాపనాశం'గా వచ్చిన 'దృశ్యం'
  • సీక్వెల్ పై దృష్టి పెట్టిన కమల్
  • షూటింగుకు సన్నాహాలు  
  • గౌతమి పాత్రలో నదియా
కమలహాసన్ ఒక వైపున 'ఇండియన్ 2' .. మరో వైపున 'విక్రమ్' వంటి భారీ సినిమాలను పెట్టుకున్నారు. కానీ ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన, ఈ లోగా 'దృశ్యం 2' రీమేక్ ను చేయడానికి సిద్ధమవుతున్నారు. మలయాళ మూలకథ దర్శకుడు జీతూ జోసెఫ్ నే ఈ సినిమాను కూడా రూపొందించనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. అయితే కథానాయిక విషయంలోనే ఇబ్బంది వచ్చింది.

తమిళంలో 'దృశ్యం' సినిమా 'పాపనాశం' అనే టైటిల్ తో ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఆ సినిమాలో కమల్ భార్య పాత్రలో గౌతమి నటించింది. అయితే కొంతకాలం క్రితం కమల్ .. గౌతమి మధ్య మనస్పర్థలు తలెత్తడం వలన, వాళ్లిద్దరూ కలిసి నటించలేని పరిస్థితి ఉంది. దాంతో కమల్ భార్య పాత్ర కోసం 'మీనా'ను తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే మలయాళంలో .. తెలుగులో కథానాయకుడి భార్య పాత్రలో మీనానే నటించింది. మళ్లీ తమిళంలో కూడా ఆమెనే అయితే కొత్తదనం లోపిస్తుందని భావించి, 'నదియా'ను తీసుకున్నారట.  
Kamal Haasan
Nadiya
Gowthami

More Telugu News