Dodla Dairy: అరంగేట్రంలో అదరగొట్టిన దొడ్ల డెయిరీ... ఒడిదుడుకుల్లో కిమ్స్!

Dodla and KIMS Listed in Stock Market
  • ఇటీవల ఐపీఓకు వచ్చిన రెండు సంస్థలు
  • 20 శాతం వరకూ లాభాన్నిచ్చిన దొడ్ల డెయిరీ
  • లాభం నుంచి నష్టాల్లోకి జారిన కిమ్స్

గత వారంలో ఐపీఓకు వచ్చి, షేర్లను కేటాయించిన దొడ్ల డెయిరీ, కిమ్స్ (కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)  ఈ ఉదయం బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్టింగ్ అయ్యాయి. రూ. 528కి కేటాయించిన దొడ్ల ఈక్విటీ షేరు, సెషన్ ఆరంభంలోనే భారీగా లాభపడింది. గరిష్ఠంగా రూ. 613 వరకూ వెళ్లిన ఈక్విటీ, ప్రస్తుతం రూ. 602 వద్ద కదలాడుతోంది.

ఇక కిమ్స్ ఈక్విటీ విషయానికి వస్తే, రూ. 1,008 ఈక్విటీ ధర కాగా, ఆదిలో లాభాలు అందించి, రూ.1,057 వరకూ వెళ్లిన ధర, ఇప్పుడు రూ. 970 వద్ద కదలాడుతోంది.

ఈ ఉదయం 10.30 గంటల సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్, క్రితం ముగింపుతో పోలిస్తే 18 పాయింట్లు నష్టపోయి, 52,914 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. సెషన్ ఆరంభంలో 53వేల మార్క్ ను సూచిక తాకగా, ఆ తరువాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో మార్కెట్ కిందకు జారింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక ఎన్ఎస్ఈ, దాదాపు స్థిరంగా ఉంది.

  • Loading...

More Telugu News