'డిక్టేటర్' దర్శకుడితో బాలయ్య సినిమా ఖరారే!

Balakrishna in director Sriwass movie
  • 'అఖండ' దసరాకి వచ్చే ఛాన్స్
  • గోపీచంద్ మలినేనితో పట్టాలపైకి
  • శ్రీవాస్ డైరెక్షన్లో మరోసారి
  • లైన్లో వినాయక్ కూడా  
బాలకృష్ణ ఎప్పుడూ కూడా సినిమాల విషయంలో గ్యాప్ రానీయరు. తన సినిమాల జయాపజయాలు ఎలా ఉన్నా తదుపరి సినిమాను సాధ్యమైనంత త్వరగా పట్టాలెక్కిస్తూనే ఉంటారు. ఆయన తాజా చిత్రంగా 'అఖండ' రూపొందుతోంది. ఈ దసరాకు ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఆ తరువాత సినిమాను ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నారు. 'క్రాక్' సినిమాతో గోపీచంద్ మలినేని భారీ హిట్ ఇచ్చి ఉండటం వలన, ఈ ప్రాజెక్టుపై సహజంగానే భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.

ఈ నేపథ్యంలో శ్రీవాస్ దర్శకత్వంలో బాలయ్య మరో సినిమా చేయనున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. 'లక్ష్యం' .. 'లౌక్యం' వంటి సూపర్ హిట్లు ఇచ్చిన శ్రీవాస్, ఆ మధ్య బాలయ్యతో 'డిక్టేటర్' చేశాడు. ఆ సినిమా ఫరవాలేదనిపించుకుంది. మళ్లీ ఇప్పుడు ఈ కాంబినేషన్ ఓకే అయిందని అంటున్నారు. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన ఈ సినిమాను, సీకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సి.కల్యాణ్ నిర్మించనున్నారని చెబుతున్నారు. ఇక శ్రీవాస్ సినిమా తరువాత అనిల్ రావిపూడి .. వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ సినిమాలు ఉండనున్నట్టు తెలుస్తోంది.      
Go Back to Shorts
Balakrishna
Boyapati Sreenu
Sriwass

More Telugu News