Andhra Pradesh: డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో అత్తపై మసులుతున్న నూనె పోసిన కోడలు

daughter in law throws Hot Oil onto Mother In Law
  • కృష్ణా జిల్లా గుడివాడలో దారుణం
  • తీవ్రగాయాలతో చికిత్స
  • కోడలు, కుమారుడు అరెస్ట్
డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో అత్తపై ఓ కోడలు మసులుతున్న నూనెను పోసింది. తీవ్రగాయాలపాలైన ఆ అత్త ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో జరిగింది. మందపాడుకు చెందిన చుక్కా లక్ష్మికి ‘జగనన్న చేయూత’ డబ్బులు వచ్చాయి. ఆ డబ్బు ఇవ్వాలని లక్ష్మిని ఆమె కోడలు స్వరూప డిమాండ్ చేసింది. అయితే, లక్ష్మి అందుకు తిరస్కరించింది.

దీంతో ఆగ్రహానికి గురైన స్వరూప.. ఇంట్లో నిద్రపోతున్న సమయంలో లక్ష్మిపై వేడి వేడి నూనె పోసి హత్యాయత్నం చేసింది. ఆమె కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారొచ్చి గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇంతటి ఘాతుకానికి తెగబడిన లక్ష్మి కోడలు స్వరూప, కుమారుడు శివను పోలీసులు అరెస్ట్ చేశారు.
Andhra Pradesh
Crime News
Krishna District

More Telugu News