ఏపీకి కొత్తగా 4.09 లక్షల కరోనా వ్యాక్సిన్ల రాక

  • ఇటీవల ఏపీలో భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్
  • ఒక్కరోజే 13 లక్షల వ్యాక్సిన్లు
  • తాజాగా గన్నవరం చేరుకున్న డోసులు
  • స్టోరేజి యూనిట్ లో భద్రపరిచిన అధికారులు
ఏపీలో ఇటీవల రికార్డు స్థాయిలో ఒక్కరోజే 13 లక్షల వ్యాక్సిన్ డోసులు వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ మరోసారి వ్యాక్సినేషన్ డ్రైవ్ కు సిద్ధమవుతోంది. రాష్ట్రానికి మరో విడత వ్యాక్సిన్ డోసులు అందాయి. తాజాగా గన్నవరం ఎయిర్ పోర్టుకు 4.09 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. వాటిలో 3.12 లక్షలు కొవిషీల్డ్ వ్యాక్సిన్లు కాగా... 97,410 కొవాగ్జిన్ వ్యాక్సిన్లు ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ డోసులను ప్రస్తుతం గన్నవరం స్టోరేజి యూనిట్ లో భద్రపరిచారు. వీటిని త్వరలోనే జిల్లాలకు తరలిస్తారు.

Corona Vaccine
Andhra Pradesh
Gannavaram
Vaccination Drive

More Telugu News