Rythu Bandhu: తెలంగాణలో రైతుబంధు సాయం వివరాలు ఇవిగో!

  • రైతులకు పెట్టుబడి సాయం
  • వర్షాకాలంలో 63.25 లక్షల మంది రైతులకు అర్హత
  • నేడు 17,776 మంది రైతుల ఖాతాల్లో జమ
  • ఇప్పటివరకు 60.74 లక్షల మందికి సాయం
  • రూ.7,298 కోట్లు విడుదల
Rythu Bandhu continues in Telangana

తెలంగాణలో రైతుబంధు షురూ అయింది. రైతు బంధు పథకంలో భాగంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఈ వర్షాల సీజన్ లో 63.25 లక్షల మంది రైతులను రైతుబంధు పథకానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. 2020తో పోల్చితే మరో 2,81,865 మంది రైతులకు ఈ పథకం వర్తింపజేస్తున్నారు. ఈ క్రమంలో నేడు 17,776 మంది రైతులకు లబ్ది చేరేలా రూ.120.16 కోట్ల మేర నిధులు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు 60.74 లక్షల మంది రైతులకు రూ.7,298.83 కోట్లు రైతుబంధు సాయం రూపంలో అందించినట్టు ప్రభుత్వం తెలిపింది.

More Telugu News