వివేక హ‌త్య కేసులో మాజీ డ్రైవ‌ర్ ద‌స్త‌గిరిని ప్ర‌శ్నిస్తోన్న సీబీఐ అధికారులు

cbi trial in veveka murder case
  • కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో విచార‌ణ‌
  • వ‌రుస‌గా 17వ రోజూ వివ‌రాల‌ను రాబ‌ట్టేందుకు య‌త్నిస్తోన్న‌ అధికారులు
  • నేడు ప‌లువురు అనుమానితులను ప్రశ్నించే అవకాశం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర ద‌ర్యాప్తు బృందం (సీబీఐ) కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో విచార‌ణ కొనసాగిస్తోంది. కొన్ని రోజులుగా సీబీఐ అధికారులు అనుమానితుల‌ను ప్ర‌శ్నిస్తోన్న విష‌యం తెలిసిందే. వ‌రుస‌గా 17వ రోజు ఈ కేసులో మ‌రిన్ని వివ‌రాల‌ను రాబ‌ట్టేందుకు అధికారులు ప‌లువురిని ప్ర‌శ్నిస్తున్నారు.

మరోసారి వివేక మాజీ డ్రైవర్ దస్తగిరిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు అతనిని సీబీఐ అధికారు‌లు ప్ర‌శ్నించి ప‌లు వివ‌రాలు రాబ‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ రోజు పులివెందులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కొందరు అనుమానితులు అధికారుల ముందు హాజరయ్యే అవకాశం ఉంది.

కేసులో కీల‌కంగా భావిస్తోన్న‌ వైఎస్‌ వివేక ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, కడపకు చెందిన రవిశంకర్‌, పులివెందులకు చెందిన కృష్ణయ్య, సావిత్రి దంపతులు, వారి కుమారులు కిరణ్‌కుమార్‌ యాదవ్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌లను ఇప్ప‌టికే ప్ర‌శ్నించారు.  
Go Back to Shorts
YS Vivekananda Reddy
Andhra Pradesh
Kadapa District

More Telugu News