బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 21వ వార్షికోత్సవానికి హాజరైన బాలకృష్ణ
- సోషల్ మీడియాలో వివరాలు తెలిపిన బాలయ్య
- ఎంతో సంతోషంగా ఉందని వ్యాఖ్యలు
- అత్యుత్తమ ఆసుపత్రుల్లో ఇదొకటని వెల్లడి
- కరోనా వేళ కూడా సేవలు అందిస్తున్నట్టు ఉద్ఘాటన
ఈ ఆసుపత్రిని తమ తల్లిగారైన బసవతారకం పేరిట తమ తండ్రి గారు నందమూరి తారక రామారావు స్థాపించారని బాలకృష్ణ వెల్లడించారు. ఎంతోమంది గొప్ప దాతల సహకారంతో తన తండ్రి ఆశయం నిర్విఘ్నంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. భారత్ లో ఉన్న అత్యుత్తమ క్యాన్సర్ ఆసుపత్రుల్లో తమది కూడా ఒకటని గర్వంగా చెప్పగలనని బాలకృష్ణ వివరించారు. కరోనా సంక్షోభ సమయంలోనూ క్యాన్సర్ రోగులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.