Nara Lokesh: అత్యాచార ఘ‌ట‌న‌ నేపథ్యంలో సీఎం జగన్ పై లోకేశ్ విమర్శలు

lokesh slams ycp
  • సీతానగరం పుష్కరఘాట్ వద్ద దారుణంపై స్పంద‌న‌
  • తాడేప‌ల్లి ప్యాలెస్ కి కూతవేటు దూరంలో అత్యాచారం
  • అత్యాచారం చేశారనే సమాచారమైనా మీకు తెలుసా?
  • గన్ కంటే జగన్ ముందొస్తాడు అన్నారు క‌దా?
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆడపిల్లకి అన్యాయం జరిగితే గన్ కంటే ముందొస్తాడు జగన్ అంటూ పంచ్ డైలాగులేశారని, ఏపీలో ఆడ‌పిల్ల‌ల‌పై అన్యాయాలు జ‌రుగుతూనే ఉన్నాయ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. సీతానగరం పుష్కరఘాట్ వద్ద కృష్ణా నది వద్ద యువకుడిని తాళ్లతో బంధించి అతడి ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడిన కేసు అంశాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు.

'జనం తిరగబడతారనే భయంతో రెండేళ్లుగా తాడేపల్లి ప్యాలెస్ లో హోం ఐసోలేషన్ అయిన సీఎం జగన్ రెడ్డి గారూ.. మీ  ప్యాలెస్ కి కూతవేటు దూరంలో ఒక యువతిని దుండగులు అత్యంత దారుణంగా అత్యాచారం చేశారనే సమాచారమైనా మీకు తెలుసా?' అని లోకేశ్ ప్ర‌శ్నించారు.

'రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టే పోలీసులు ఓ అమ్మాయికి ఇంత అన్యాయం జరిగితే ఏమయ్యారు? సొంత చెల్లెళ్లకే న్యాయం చేయలేనోడు అన్న కాదు దున్న. ఆడపిల్లకి అన్యాయం జరిగితే గన్ కంటే ముందొస్తాడు జగన్ అంటూ పంచ్ డైలాగులేశారు' అని లోకేశ్ ట్వీట్ చేశారు.

'ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఇంత అన్యాయం జరిగితే ఏడమ్మా జగన్? అమరావతి ఉద్యమానికి భయపడి వేలమంది పోలీసుల్ని కాపలా పెట్టుకున్న పిరికి పంద జగన్ పాలనలో మహిళా భద్రత ప్రశ్నార్థ‌కమైంది' అని లోకేశ్ విమ‌ర్శ‌లు గుప్పించారు.  
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News