తెలుగు రాష్ట్రాల పర్యటనల్లో భావోద్వేగాలకు గురయ్యా: జస్టిస్ ఎన్వీ రమణ

  • తెలుగు రాష్ట్రాల్లో సీజేఐ పర్యటన
  • ముగింపు సందర్భంగా ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు
  • పర్యటన సంతృప్తి కలిగించిందని వెల్లడి
  • తెలుగు ప్రజలకు శతకోటి వందనాలు తెలిపిన వైనం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు. తన పర్యటన ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల పర్యటన ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఆదరాభిమానాలు చూపిన తెలుగు ప్రజలకు శతకోటి వందనాలు అంటూ వ్యాఖ్యానించారు.

తెలుగు రాష్ట్రాల్లో పర్యటన తనను భావోద్వేగాలకు గురిచేసిందని ఎన్వీ రమణ చెప్పారు. తెలుగు ప్రజల దీవెనలతో సీజేఐ బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తానని ఉద్ఘాటించారు. తెలంగాణ రాజ్ భవన్, హైకోర్టు, పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. తిరుమల, యాదాద్రి, శ్రీశైలం పాలకమండళ్లకు కృతజ్ఞతలు తెలిపారు.

Justice Ramana
Andhra Pradesh
Telangana
CJI
Supreme Court

More Telugu News