పరీక్షలు రద్దు చేయని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు.. ఆ విషయం తెలియదన్న ఏపీ మంత్రి!
- ఏపీ, త్రిపుర, పంజాబ్, అస్సాం రాష్ట్రాలకు నోటీసులు
- నోటీసులు అందలేదన్న మంత్రి ఆదిమూలపు సురేశ్
- తమ వైఖరేంటో సుప్రీంకు చెబుతామన్న మంత్రి
అయితే, సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన విషయం తమకు తెలియదని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. నోటీసులు అందిన తర్వాత ఈ విషయమై పరిశీలించి చర్చిస్తామన్నారు. పరీక్షల విషయంలో తాము మొదటి నుంచి ఒకే వైఖరితో ఉన్నామని, ఇందులో మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని మంత్రి వివరించారు.