Telangana: తెలంగాణకు మూడు రోజుల వర్ష సూచన

3 days rain forecast for Telangana
  • ఈరోజు, రేపు, ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశం
  • కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
  • రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు
రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. నైరుతి, పశ్చిమ దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని, ఈ సీజన్ లో సరిపడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Telangana
Rain Forecast

More Telugu News