Varla Ramaiah: ఎమ్మెల్సీలుగా నియమితులైన ఆ ముగ్గురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి: వర్ల రామయ్య

Varla Ramaiah Writes letter to Governor over criminal cases against newly elected MLCs
  • గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ కోటా ఫైలుకు గవర్నర్ ఆమోద ముద్ర
  • తోట త్రిమూర్తులుపై 20 నెలలుగా విచారణ
  • హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న రమేశ్ యాదవ్
  • గవర్నర్‌కు రాసిన లేఖలో వర్ల రామయ్య ఆరోపణ

ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీల కోటాలో లేళ్ల అప్పిరెడ్డి, రమేశ్ యాదవ్, తోట త్రిమూర్తులు, మోషేన్ రాజుకు సంబంధించిన ఫైలుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. దీంతో వారు త్వరలోనే పదవులు చేపట్టనున్నారు. అయితే గవర్నర్ ఆమోదించిన వారిలో ముగ్గురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ రాశారు.

ఎస్సీ యువకుడికి శిరోముండనం చేసిన కేసులో తోట త్రిమూర్తులు 20 నెలులగా విచారణ ఎదుర్కొంటున్నారని, ఆయనపై పలు క్రిమినల్ కేసులు కూడా పెండింగులో ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. లేళ్ల అప్పిరెడ్డి పేరు కూడా పోలీసు రికార్డుల్లో నమోదై ఉందని తెలిపారు. ఓ హత్య కేసులో రమేశ్ యాదవ్ విచారణను ఎదుర్కొంటున్నారని వర్ల రామయ్య ఆ లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News