Telangana: తెలంగాణలో 96 శాతానికి పెరిగిన కరోనా రికవరీ రేటు

  • ఇప్పటివరకు 6.04 లక్షల కరోనా కేసుల నమోదు
  • 5.80 లక్షల మందికి కరోనా నయం
  • ఇంకా 20,461 మందికి చికిత్స
  • తాజాగా 1,511 పాజిటివ్ కేసులు
Corona recovery rate increases in Telangana

తెలంగాణలో కరోనా మరింతగా తగ్గుముఖం పట్టింది. రోజువారీ కేసుల్లో భారీగా తగ్గుదల నమోదు కాగా, రికవరీ రేటు 96.03 శాతానికి పెరిగింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,175 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక, రోజువారీ కేసుల విషయానికొస్తే... 1,10,681 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,511 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 173 కొత్త కేసులు నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో 139 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కామారెడ్డి జిల్లాలో 5 పాజిటివ్ కేసులు గుర్తించారు.

అదే సమయంలో రాష్ట్రంలో 12 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,496కి పెరిగింది. అటు, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,04,880కి చేరింది. ఇప్పటిదాకా 5,80,923 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 20,461 మందికి చికిత్స జరుగుతోంది.

More Telugu News