Telangana: మాంసం కోసం క్రూరం.. బతికి ఉండగానే పాడి గేదెల తొడలు కోసిన యువకులు!

 chopping off the thighs of cattle while still alive for meat
  • సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో ఘటన
  • మాంసం కోసం దారుణం
  • నిందితుల్లో ముగ్గురు ఏపీ వారు కాగా, ఒకడు నేపాలీ యువకుడు
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని సిరిసినగండ్ల శివారులో దారుణం జరిగింది. కొందరు యువకులు బతికి ఉండగానే పాడి గేదెల తొడలు కోసి మాంసం తీసుకెళ్లారు. నలుగురు నిందితుల్లో ఒకరు నేపాల్ యువకుడు కాగా, మిగతా ముగ్గురు ఏపీకి చెందినవారని పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. సిరిసినగండ్ల-దమ్మకపల్లి గ్రామాల మధ్య రాజేందర్‌రెడ్డి అనే రైతుకు ఉన్న వ్యవసాయ క్షేత్రంలో నేపాల్ చెందిన యువకుడితో పాటు ఏపీకి చెందిన మరో ముగ్గురు యువకులు పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం రాజగిరి వెంకటేశం అనే రైతు తన పాకలోని గేదెల నుంచి పాలు పిండుకుని వెళ్లిపోయాడు.

రాత్రివేళ ఆ పాకలో దూరిన నలుగురు నిందితులు మాంసం కోసం రెండు గేదెల తొడలు కోశారు. దీంతో విలవిల్లాడిన గేదెలు రక్తస్రావమై చనిపోయాయి. ఉదయం పొలానికి వచ్చిన రైతు చనిపోయిన గేదెలను చూసి విస్తుపోయాడు. విషయం గ్రామస్థులకు చెప్పి నిందితుల కోసం గాలించగా వారంతా వ్యవసాయ క్షేత్రంలో మాంసం వండుతూ కనిపించారు. గ్రామస్థులను చూసి నిందితుల్లో ముగ్గురు పరారు కాగా, నేపాలీ యువకుడు సందీప్ (25) వారికి పట్టుబడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు.
Telangana
Andhra Pradesh
Crime News
Siddipet District

More Telugu News