Telangana: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో 20 వేల పోలీసు పోస్టుల భర్తీ

soon telangana govt Issue notification for 20 thousand police posts
  • వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ
  • పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు చెప్పిన మంత్రి
  • సంగారెడ్డిలో నూతన పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం
రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలోనే 20 వేల పోలీసు పోస్టులను భర్త చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. సంగారెడ్డిలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని నిన్న ప్రారంభించిన మంత్రి అనంతరం మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసినట్టు చెప్పారు.రాష్ట్రంలో శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టినట్టు మహమూద్ అలీ తెలిపారు.
Telangana
Police
Md Mahamood Ali

More Telugu News