గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్!
- 'చి..ల..సౌ' సినిమాతో హిట్
- 'మన్మథుడు 2'తో భారీ ఫ్లాప్
- గీతా ఆర్ట్స్ 2 పై లవ్ స్టోరీ
- త్వరలో సెట్స్ పైకి
నాగార్జున కథనాయకుడిగా రాహుల్ తెరకెక్కించిన 'మన్మథుడు 2' పరాజయం పాలైంది. ఆ తరువాత రాహుల్ మరో మంచికథను తయారుచేసుకుని రంగంలోకి దిగాడు. గీతా ఆర్ట్స్ 2 వారికి ఆయన ఆ కథను వినిపించినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా గీతా ఆర్ట్స్ 2 వారు ఆయన కథను ఓకే చేశారట. దాంతో సెట్స్ పైకి వెళ్లడానికి రాహుల్ సన్నాహాలు చేసుకుంటున్నాడని, ఇది ఒక అందమైన ప్రేమకథ అని అంటున్నారు. ఓ మాదిరి బడ్జెట్ తో ఇది రూపొందనుంది. మరి ఈ లవ్ స్టోరీలో నాయకానాయికలు ఎవరో .. ఈ కథతో రాహుల్ ఎంతవరకూ యూత్ ను మెప్పిస్తాడో చూడాలి.