YS Jagan: అధికార వికేంద్రీకరణ పక్కా.. మూడు రాజధానుల ఏర్పాటు ఖాయం: తేల్చిచెప్పిన సజ్జల

Three Capitals are sure says sajjala
  • రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా జగన్ పర్యటన సాగింది
  • శాసన మండలి రద్దు అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది
  • జగన్ పర్యటన వ్యక్తిగతం కాదు
రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన సాగిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారం, విభజన చట్టంలోని సమస్యల పరిష్కారంతోపాటు పలు అభివృద్ధి అంశాలపై జగన్ కేంద్రంతో చర్చించారని తెలిపారు. ఏపీలో అధికార వికేంద్రీకరణ ఖాయమని, మూడు రాజధానుల ఏర్పాటు పక్కా అని సజ్జల తేల్చి చెప్పారు.

చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా అంశాన్ని నీరు గారిస్తే తాము మాత్రం దాని కోసం పోరాడుతున్నామన్నారు. జగన్ పర్యటన వ్యక్తిగతం కాదని, రాష్ట్ర సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆయన పర్యటన సాగిందని అన్నారు. శాసనమండలి రద్దు అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని, దానిని రద్దు చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సజ్జల పేర్కొన్నారు.
YS Jagan
Andhra Pradesh
Sajjala Ramakrishna Reddy

More Telugu News