విరాళాల్లో ఏడోసారీ ‘టాప్’ లేపిన బీజేపీ.. రూ. 785.77 కోట్లతో మరోమారు అగ్రస్థానం
- రూ. 139 కోట్ల విరాళాలతో బీజేపీ తర్వాతి స్థానంలో కాంగ్రెస్
- టీఆర్ఎస్‌కు రూ. 89 కోట్లకు పైగా విరాళాలు
- వైసీపీకి రూ. 8.92 కోట్లు, టీడీపీకి రూ. 2.60 కోట్ల విరాళాలు
- వెల్లడించిన ఎన్నికల కమిషన్
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, గులాబీ పార్టీ టీఆర్ఎస్‌కు రూ. 89,55,21,348 విరాళంగా రాగా, వైసీపీకి రూ. 8,92,45,126, టీడీపీకి రూ. 2,60,64,011, ఎంఐఎంకు రూ. 13,85,000 విరాళాల రూపంలో సమకూరాయి. టీఆర్ఎస్‌కు 41 మంది రూ. 20 వేలకు పైగా విరాళంగా అందించారు. మంత్రి కేటీఆర్, కూర్మయ్యగారి నవీన్ అత్యధికంగా రూ. 2.50 లక్షల చొప్పున విరాళం ఇచ్చారు.
తమిళనాడుకు చెందిన జేఎస్ఆర్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్ వైసీపీకి అత్యధికంగా రూ. 2.50 కోట్లను విరాళంగా ఇచ్చింది. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన పి.శివకుమార్ రెడ్డి కోటి రూపాయలు ఇచ్చారు.
చెన్నైకి చెందిన ట్రింప్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ టీడీపీకి అత్యధికంగా కోటి రూపాయలు విరాళం ఇచ్చింది. అలాగే, వివిధ సంస్థల నుంచి ఆయా పార్టీలకు లక్షల రూపాయలు విరాళాల రూపంలో సమకూరాయి.