ఏపీలో రెవెన్యూ లోటు భర్తీకి రూ. 1,438 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 17 రాష్ట్రాలకు రూ. 9,871 కోట్లు విడుదల
- ఇప్పటి వరకు ఏపీకి దక్కింది రూ. 4,314.24 కోట్లు
- 12 విడతల్లో ఏపీకి మొత్తంగా రూ. 17,256.96 కోట్లు
కాగా, 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 17 రాష్ట్రాలకు కలిపి రూ. 1,18,452 కోట్ల రెవెన్యూ గ్రాంటును విడుదల చేయాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేయగా, ఈ మొత్తాన్ని 12 వాయిదాల్లో చెల్లించేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ మొత్తం వాయిదాల్లో కలిపి ఏపీకి మొత్తంగా రూ. 17,256.96 కోట్లు రానున్నాయి.