Nara Lokesh: వసూలు చేసిన జేట్యాక్స్ నే పెట్టుబడులుగా చెపుతున్నారు: నారా లోకేశ్ సెటైర్

YSRCP is telling J Tax as investments says Nara Lokesh
  • పరిశ్రమలను బెదిరించి రూ. 30 వేల కోట్లు వసూలు చేశారు
  • 65 భారీ పరిశ్రమలు వచ్చాయని సెలవిచ్చారు  
  • ప్రెసిడెంట్ మెడల్ విస్కీ, ఆంధ్రా స్టార్ బ్రాందీ తప్ప వచ్చిన కంపెనీలు ఏమీ లేవు
ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. రెండేళ్ల వైసీపీ పాలనలో పరిశ్రమలను బెదిరించి వసూలు చేసిన జగన్ ట్యాక్స్ (జే ట్యాక్స్) రూ. 30 వేల కోట్లనే... రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులుగా మీరు చెప్పినట్టున్నారని లోకేశ్ వ్యంగ్యంగా అన్నారు.

రాష్ట్రానికి 65 భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని సెలవిచ్చారనీ, ప్రెసిడెంట్ మెడల్ విస్కీ, ఆంధ్రా స్టార్ బ్రాందీ కంపెనీలు తప్పించి రాష్ట్రానికి వచ్చిన కొత్త కంపెనీలు ఏమీ లేవని ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ 3, 4 స్థానాల్లో ఉంటే, రెండేళ్ల జగన్ పాలనలో 13వ స్థానానికి పడిపోయిందని విమర్శించారు.

చంద్రబాబు తీసుకొచ్చిన కియా మోటార్స్ యాజమాన్యాన్ని వైసీపీ ఎంపీలు వీధి రౌడీల కంటే ఘోరంగా బెదిరించడం చూశాక ఏ విదేశీ కంపెనీ ఏపీకి వస్తుందని ప్రశ్నించారు. జే ట్యాక్స్ చెల్లించని కంపెనీలపై పీసీబీని ప్రయోగించి మూసివేయిస్తుంటే.. కొత్తగా పెట్టుబడి పెట్టడానికి ఎవరొస్తారని ప్రశ్నించారు. 
Nara Lokesh
Telugudesam
jag
J Tax
Mekapati Goutham Reddy

More Telugu News