ఓ ఇంటివాడు కానున్న రాజ్ తరుణ్?
- కెరియర్ ఆరంభంలోనే హిట్లు
- ఇటీవల వరుస పరాజయాలు
- తగ్గుతున్న అవకాశాలు
- రీసెంట్ గా ఇల్లు కొన్న రాజ్ తరుణ్
ఈ మధ్య కాలంలో రాజ్ తరుణ్ జోరు తగ్గింది. అవకాశాల పరంగాను .. సక్సెస్ లా పరంగాను ఆయన కొంత వెనకబడిపోయాడు. మళ్లీ మునుపటి స్పీడ్ చూపించడానికి ఆయన తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో సొంత ఇంటిని ఏర్పాటు చేసుకున్న రాజ్ తరుణ్, త్వరలో పెళ్లి చేసుకోనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ విషయాన్ని రాజ్ తరుణ్ చెప్పకున్నప్పటికీ, వచ్చే ఏడాదిలో ఆయన పెళ్లి పక్కా అనే టాక్ మాత్రం నడుస్తోంది.