నా పుట్టినరోజు సందర్భంగా ఎవరూ రావొద్దు... ఒక్క అభిమాని దూరమైనా భరించలేను: బాలకృష్ణ
- జూన్ 10న బాలయ్య పుట్టినరోజు
- ప్రతి ఏటా ఘనంగా వేడుకలు
- కరోనా విలయతాండవం చేస్తోందన్న బాలయ్య
- అభిమానులు ఇళ్లలోనే ఉండాలని సూచన
- అదే తనకు పుట్టినరోజు వేడుక అని స్పష్టీకరణ
"ప్రతి ఏటా నా పుట్టినరోజు సందర్భంగా నన్ను కలిసేందుకు నలుదిక్కుల నుంచి తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని. కానీ ఇప్పుడు కరోనా విలయతాండవం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు బయటికి రావడం అభిలషణీయం కాదు. మీ అభిమానమే నన్ను ఇంతటివాడ్ని చేసింది... ఒక్క అభిమాని దూరమైనా భరించలేను. మీ అభిమానంతో సాటిరాగల ఆశీస్సు లేదు, మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు. మీ కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడపడమే నా జన్మదిన వేడుకగా భావిస్తాను. దయచేసి ఎవరూ రావొద్దు" అని బాలయ్య తన ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేశారు. ఈ విపత్కాలంలో అసువులు బాసిన అభిమానులకు, కార్యకర్తలకు, అభాగ్యులకు నివాళులు అర్పిస్తున్నానంటూ పేర్కొన్నారు.