'ఛత్రపతి' రీమేక్ విలేజ్ సెట్ డ్యామేజ్!
- 'ఛత్రపతి' హిందీ రీమేక్ కి సన్నాహాలు
- వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్
- 6 ఎకరాల్లో వేసిన విలేజ్ సెట్
- వర్షాల కారణంగా దెబ్బతిన్న సెట్
'ఛత్రపతి' రీమేక్ సెట్ డ్యామేజ్ కారణంగా నిర్మాతకు పెద్దమొత్తంలోనే నష్టం వచ్చిందని అంటున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తరువాత సెట్ వర్క్ మళ్లీ మొదటి నుంచి చేసుకురావాలట. కరోనా కారణంగా అవుట్ డోర్ కి వెళ్లలేని పరిస్థితుల్లో సెట్లు వేయించేసి పని కానిచ్చేద్దామని అనుకుంటే, వర్షాల కారణంగా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. నాని హీరోగా చేస్తున్న 'శ్యామ్ సింగ రాయ్' కోసం వేసిన సెట్ కూడా ఇటీవల వర్షాల కారణంగా డ్యామేజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక 'ఛత్రపతి' హిందీ రీమేక్ తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ 'కర్ణన్' రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.