టెట్ అభ్యర్థులకు తీపి కబురు.. ఉత్తీర్ణత ఇక జీవితకాలం చెల్లుబాటు!
- ఇప్పటి వరకు ఏడేళ్లుగా ఉన్న చెల్లుబాటు కాలం
- తాజాగా జీవితకాలానికి పెంచుతున్నట్టు ప్రకటించిన కేంద్రం
- టీచింగ్ వృత్తిని ఎంచుకున్న వారికి ఉద్యోగావకాశాల పెంపుకోసమేనన్న కేంద్రం
అలాగే, ఇప్పటికే ఏడేళ్లు పూర్తయిన వారికి ధ్రువీకరణ పత్రాలను పునరుద్ధరించడమో, లేదంటే కొత్త పత్రాలు జారీ చేయడమో చేయాలని సూచించింది. టీచింగ్‌ను వృత్తిగా ఎంచుకున్న వారికి ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది.