ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ అదే!
- కొరటాలతో ఎన్టీఆర్ తాజా చిత్రం
- నెక్స్ట్ మూవీ ప్రశాంత్ నీల్ తో
- అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి
ఈ నేపథ్యంలో ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతుందనే వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ మాఫియా డాన్ గా కనిపించనున్నాడనే ప్రచారం జరిగింది. ఇక పొలిటీషియన్ పాత్రను పోషించనున్నాడనే మరో టాక్ కూడా వచ్చింది. పొలిటీషియన్ గా కనిపించనున్నాడనే మాటే నిజమట. ఇంతవరకూ ఈ తరహా పాత్రను ఎన్టీఆర్ చేయలేదు. ఈ పాత్రను ప్రశాంత్ నీల్ డిజైన్ చేసిన తీరు అదుర్స్ అనిపించేలా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడీగా ఎవరు అలరిస్తారో .. అల్లరి చేస్తారో చూడాలి.