KCR: కరోనా రోగులతో నేరుగా మాట్లాడిన ఏకైక సీఎం కేసీఆర్: తలసాని

KCR is the only CM who approached Corona patients says Talasani
  • అన్ని రంగాల్లో తెలంగాణ ముందుకు వెళ్తోంది
  • సంక్షోభ సమయంలో కూడా వరి కొనుగోలు చేశాం
  • నిరంతరాయంగా కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని... ఇప్పుడు అన్ని రంగాల్లో రాష్ట్రం ముందుకు వెళ్తోందని చెప్పారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులను ఏ ముఖ్యమంత్రి కూడా పరామర్శించలేదని... కేవలం కేసీఆర్ మాత్రమే కరోనా పేషెంట్లను నేరుగా పరామర్శించారని అన్నారు.

కరోనా సమయంలో కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా కేసీఆర్ అనేక చర్యలను తీసుకుంటున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రైతుల నుంచి వరి కొనుగోలు చేశామని తెలిపారు. సంక్షోభ సమయంలో కూడా సంక్షేమ పథకాలను కొనసాగించామని చెప్పారు. దేశంలో నిరంతరాయంగా విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
KCR
TRS
Telangana
Talasani

More Telugu News