Kodandaram: ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఉంది: కోదండరామ్

- అమరవీరులకు నివాళులు
- ప్రజాస్వామిక తెలంగాణ రావాలని కోరుకుందాం
- కేసీఆర్ దర్శనభాగ్యం ప్రజలకు కలగడం లేదు
తెలంగాణ సర్కారుపై టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్, నాంపల్లిలోని గన్‌పార్క్ వద్ద అమరవీరులకు ఆయన నివాళులు అర్పించి, అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామిక తెలంగాణ రావాలని అందరమూ కోరుకుందామని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శనభాగ్యం ప్రజలకు కలగడం లేదని ఆయన విమర్శించారు. తెలంగాణలో ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అనేక సమస్యలకు పరిష్కార మార్గం దొరకట్లేదని చెప్పారు.