China: వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద చైనా, పాకిస్థాన్ సంయుక్త విన్యాసాలు

China and Pakistan conducting combined army training
  • టిబెట్ ప్రాంతంలో సంయుక్త సైనిక విన్యాసాలు
  • పాక్, చైనా సైనికులకు సంయుక్తంగా శిక్షణా కార్యక్రమాలు
  • ఎంతమంది పాక్ సైనికులు శిక్షణ పొందుతున్నారనే విషయంలో లేని క్లారిటీ
టిబెట్ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ వద్ద పాకిస్థాన్ తో కలిసి చైనా సంయుక్త సైనిక విన్యాసాలను నిర్వహిస్తున్నాయి. వివిధ రకాల యుద్ధ రీతులను ఈ విన్యాసాల్లో ప్రదర్శిస్తున్నాయి. చైనా తన ఎయిర్ డిఫెన్స్ కు చెందిన మిస్సైళ్లను ప్రయోగిస్తోంది. గత నెల 22 నుంచే ఈ విన్యాసాలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఈ వారం చివరి వరకు విన్యాసాలు కొనసాగనున్నాయి.

 చైనా, పాకిస్థాన్ ల మధ్య బలమైన బంధం ఉన్న సంగతి తెలిసిందే. పాక్ పెంచి పోషిస్తున్న టెర్రరిస్టులకు కూడా చైనా మద్దతుగా ఉంటోంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో తనకు ఉన్న వీటో పవర్ ను ఉపయోగిస్తూ భారత్ కు ప్రతిబంధకాలను సృష్టిస్తోంది.

మరోవైపు, చైనా అధీనంలోని ప్రాంతంలో పాక్, చైనా సైనికులకు ట్రైనింగ్ క్యాంపులు నడుస్తున్నాయి. ఈ శిక్షణలో శత్రు విమానాలు, మిస్సైళ్లు, యూఏవీలను టార్గెట్ చేయడం వంటి అంశాల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. అయితే, ఆ ట్రైనింగ్ క్యాంపుల్లో ఎంత మంది పాక్ సైనికులు ఉన్నారనే విషయం మాత్రం వెల్లడి కాలేదు.
China
Pakistan
Army cooperation

More Telugu News