తమ్ముడు ఈటల రాజేందర్ సరైన దిశలోనే వెళుతున్నాడు: విజయశాంతి

Vijayashanti opines on Eatala
  • ఇటీవల మంత్రి పదవిని కోల్పోయిన ఈటల
  • భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఈటలపై వేటు
  • బీజేపీలో చేరికకు ఈటల సన్నాహాలు
  • అభినందించిన విజయశాంతి
ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన ఈటల రాజేందర్ బీజేపీకి దగ్గరవుతుండడం పట్ల ఆ పార్టీ నేత విజయశాంతి స్పందించారు. తమ్ముడు ఈటల రాజేందర్ బీజేపీ వైపు సరైన దిశగా వెళుతున్నారని, మంచి నిర్ణయం తీసుకున్నందుకు అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఇవాళ టీఆర్ఎస్ ను ఎదిరించి నిలిచి, గెలిచే సత్తా బీజేపీకి మాత్రమే ఉందనేది తిరుగులేని వాస్తవం అని అభివర్ణించారు.

కాంగ్రెస్ నుంచి గెలిపించిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళ్లిపోతారన్న భావం తెలంగాణ ప్రజల్లో ఇప్పటికే పూర్తిగా నిరూపితమైందని తెలిపారు. ఉద్యమకారుల ఆత్మగౌరవం, తెలంగాణ ప్రజల భవిష్యత్ రెండూ బీజేపీతోనే నిలబడతాయనేది స్పష్టమైన నిజం అని విజయశాంతి పేర్కొన్నారు.
Go Back to Shorts
Vijayashanti
Eatala Rajender
BJP
TRS
Telangana

More Telugu News