ధనుశ్ 'జగమే తంత్రం' నుంచి ట్రైలర్ రిలీజ్
- మాఫియా నేపథ్యంలో సాగే 'జగమే తంత్రమ్'
- 'సురులి' పాత్రలో ధనుశ్
- ప్రత్యేక ఆకర్షణగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ధనుశ్ పాత్ర స్వరూప స్వభావాలను ఆవిష్కరిస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. తమిళనాడుకు చెందిన 'సురులి' లండన్ వెళ్లి అక్కడి మాఫియా ముఠాతో తలపడటం .. అక్కడ అతనికి ఎదురైన పరిస్థితులపై ఈ కథ నడవనుందనే విషయం అర్థమవుతుంది. సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ధనుశ్ కి, ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.