పేదలకు అండగా సినీ నటి షకీల
- లాక్ డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న పేదలు
- ఆహారాన్ని అందిస్తున్న షకీలా
- షకీలాపై వెల్లువెత్తుతున్న ప్రశంసలు
ప్రస్తుతం తమిళనాడులో ఉన్న ఆమె పేద ప్రజల కోసం ఫుడ్ ప్యాకెట్లను అందిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మనకున్న రెండు చేతుల్లో ఒక చేతిని మీకోసం, రెండో చేతిని పేదలకు సాయం చేయడం కోసం వాడాలని కోరారు. మరోవైపు, షకీలా చేస్తున్న సేవ పట్ల పలువురు ప్రశంసలు కురిపించారు.